Monday, March 14, 2011

తెలుగు పదానికి ఖర్మ దినం

తెలుగు పదానికి ఖర్మ దినం, ఇది తెలంగాణ తల్లి కర్మ ఫలం,
కోట్ల దేవుల్లే శాపములివ్వగ వెలెసెను కలియుగ పెంట మొహం...

__ __ జననం...
ఇది __ __ జననం... 
ఇది _ _ జననం...

రాష్ర్ట భవితనే తెగనరికే, అసురఖడ్గమ్మిది కంటకము.
వింతలోకమున కొంతముర్ఖులతొ గుండాగిరినే పొందినదై,    
అర్ధం పర్ధం లేని వాక్కుతో పెంటచెస్టలతొ గమకితమై, 
చెట్టసభలలో చెత్తవాక్యలథొ సభ మర్యాధను లాస్యము చేసె  
నారదుడెరుగని నాటక ముని వలె పొత్తులకై పలు చెంతలు చేరి   
యువత భవితను అవక తవకగ ఆత్మాహుతికై వుసిగొల్పితివీ     
కడుపు కోతతో తల్లడిల్లు ఆ తల్లుల శోకపు జల్లున తడిసే  
మనిశై వచ్చిన మర్కటము, విలయవిక్రుతుల కారకము

--- జననం...
ఇది --- జననం...
ఇది --- జననం....

Saturday, July 17, 2010

ఎగిరేయ్ మనసా ఎగిరేయ్

ఎగిరేయ్ మనసా ఎగిరేయ్,   గమ్యం చేరగ ఎగిరేయ్
తీరం వైపుగ ఎగిరేయ్

మనసుకు గొల్లెం వెయ్యకు నేడుఎగిరే పక్షిని తనివిగ చూడు,   
ఆశను ఒంటరి చెయ్యకు నేడు, జంటగ వెల్లర ముందుకు తోడు,  

శూన్యం శాంతిని తలపించొచ్చుప్రళయం ప్రణం తీసెయ్యొచ్చు,
కష్టం నష్టం యెదురవ్వొచ్చు,
మహ ఇష్టంగా నువ్వెదురై, అద్రుష్టం తోడుగ ఎగిరేయ్
ఎగిరేయ్ పైపై కెగిరేయ్,
ఎగిసే అల పైకెగిరేయ్, కల నిజమే చెయ్యగ ఎగిరేయ్ 

ఎగిరేయ్ మనసా ఎగిరేయ్, గమ్యం చేరగ ఎగిరేయ్
తీరం వైపుగ ఎగిరేయ్

Monday, March 08, 2010

నేడు వున్నది ఎంజొయ్ చేస్తే చాలు

నిన్న అన్నది తిరిగే రాదు, రేపు అన్నది తెలిసేం రాదు
నేడు వున్నది ఎంజొయ్ చేస్తే చాలు

లేని దానికై చింతేం వద్దు, రాని దానికై పరిగెత్తొద్దు
వున్న దానిని ప్రేమించడమే ముద్దు

కడలికందము ఎగిసే అలలు, నిదురకందము కమ్మని కలలు
మనిషికందము మొమున ఓ చిరునవ్వు

చీకటి లోనె చండ్రుడి అందం, నల్లని కాటుక కంటికి అందం
కష్టం, ఇష్టం కలిసుంటేనె అందం

Sunday, December 13, 2009

రాజకీయ నిరుద్యోగి రాత మారె ఒక రాత్రి,

సర్కారులొ పదవిలేదు, బ్యాంకు లోన డబ్బు లెదు
తాగ నీకి మందులేదు, పంటికింద ముక్కలేదు
ఎటు వెల్లిన దిక్కులేదు, ఏంచెయ్యను తోస్థలెదు

రాజకీయ నిరుద్యోగి రాత మారె ఒక రాత్రి,
తలకెక్కిన తిక్కలోన పాడినాను తెలంగాన,
నా తిక్కకు తోక లాగ వెంటొచ్చెను పెద్ద సేన,

ఊరూర తిరిగాను, వెర్రి తోటి వాగినాను,
ప్రత్యెక తెలంగాన, ఇంటింట కురువు వాన,
గోదారికి ఆనకట్ట, అడ్డొస్థే విరుగు కట్ట,
బుద్దిలేని మొద్దులంత, కలిసారు ఒక్క చోట
కండలేని గండడంట, తెలంగాన తెస్థడంట
మీకండగ తానంట, నీరుండదు ఏ కంట

చేతినిండ డబ్బులొచ్చె, సర్కారున పదవొచ్చె,
సీటు కింత పైక మొచ్చె, సెటిలయ్యే దారి తోచె,
ఏడేల్లు గడిచిపోయె తెలంగాన నిదరపోయె
తోడొచ్చిన వెర్రి మూక తిక్క కాస్థ ముదిరి పోయె
పదవి పోయె, పరువు పోయె, పెంచు కున్న ఆస్థి పోయె

మత్తెక్కిన మాయ లొన, నను తోసిరి దీక్ష్య పూన,
సర్లే ఒకదినమనుకొని మొదలెడిటిని NIM's లోన
నిజమనుకొని ఇంతలోన రగిలిపోయె తెలంగాన
నే పన్నిన వుచ్చులోన, పిచ్చెక్కిన కుర్ర సేన

కండలేని బండ నేను, తిండి లేక వుండలేను,
బిస్కట్టు తొ బతకలెను, సెలైనె తాగి సావ లేను,
దీక్ష్య నేను చెయ్యలేను, బయటి కసలు రాలేను,

తాగ నీకి మందు లేదు, పంటి కింద ముక్కలెదు
కాపాడె దిక్కులేదు, ఏంచెయ్యను తోస్థలేదు
ఇంత లోన వింత లాన, వెలిగొచ్చెను తెలంగాన

హీరొ నను చేసారు, మహాత్ముడితొ పోల్చారు
రాజకీయ సన్యాసిని రాజులాగ మార్చారు
పదవిలేని బికారికి, బతుకు దారి నేర్పారు
మీ ఋణము తీర్చలేను నా గుణము మార్చుకోను

జై జై జై తెలంగాన నా చేతికి దొరికె వీన
జై జై జై తెలంగాన డాన్సెస్థిని వీన తొన

Tuesday, June 16, 2009

చెలియా... నీ జాడేది

చెలియా.. చెలియా.. ఏ వైపు నిన్ను నే వెతికేది
కలయా.. అలయా.. తీరాన్ని దాటి నిను చేరేది
నిన్నటి ఙ్నప్థిని అడిగా నీ జాడేదో తెలుపమని
రేపటి భ్రాంతిని కోరా నిను చేరే దారిన వెల్లమని
ఇప్పటి తలపుకు తెలిపా నా నిండా నువ్వే చూడమని

చెలియా.. చెలియా.. ఏ వైపు నిన్ను నే వెతికేది
కలయా.. అలయా.. తీరాన్ని దాటి నిను చేరేది
అలసిన హౄదయం అడిగెనే, ఈ.. పయణం చాలిక ఆగని
బదులుగ మనసే కోరెనె, నిను చేరు వరకు ఆగొద్దని
విసిగిన విరహం అడిగెలే, ఈ.. జ్వాలలు ఆరేదెపుడని
వెచ్చని ఊపిరి బదులిడె, చెలి చిరునవ్వుల జల్లులు కురవనీ
చెలియా.. చెలియా.. ఏ వైపు నిన్ను నే వెతికేది
కలయా.. అలయా.. తీరాన్ని దాటి నిను చేరేది


Wednesday, March 04, 2009

నీ పేరు వెంకట సామి

నా పేరు వెంకట సామి, మీ సేవ కేసి నెనొచ్చా అన్నీ మాని,
మీ కష్టం తీరును హామి, నా మాట వింటె ఈ వూరె బంగరు భూమి,

ఉచితంగ చదివిస్త, ఆసుపత్రి కట్టిస్త,
అప్పుల్ని కట్టేస్థ, కరెంటు ప్రీగిస్థ,
మి పంట పండించ గోదారిని రప్పిస్థ,
ఏ కష్టం మీకున్న కన్నీరె నా కంట,

నా పేరు వెంకట సామి, మీ సేవ కేసి నేనొచ్చా అన్నీ మాని,
మీ కష్టం తీరును హామి, నా మాట వింటె ఈ వూరె బంగరు భూమి,

నీ పేరు వెంకట సామి, నీ తిన్నదరగ మమ్మిట్ల సంపకు సామి,
నీ నోరు మూయర సామి, నీ మాట వింటె బతుకంత బండర సామి,

మంచి నీళ్ళు కరువంటె మంచు కరగ లేదంటవ్,
రోడ్డు లెధు సూడంటె రాళ్ళు దొరక లెదంటవ్,
ఆసుపత్రి ఏదంటె డాట్టరయ్య లెడంటవ్

మీ బంటు నేనంటు ఐదేల్ల కొకసారి, వోటెయ్య మంటావు మమ్మల్ని బ్రతిమాలి
వొటెసి గెలిపిస్థే నినునమ్మి ప్రతిసారి, బస్థీకి పోతావు సల్లంగ నువు జారి

మే మారి పోతిమి సామి, వోటెయ్య మంటు మా వెంట తిరగకు సామి
మా కష్టం తెలిసిన వాన్ని, మా వోటు తోటి గెలిపించు కుటాం నమ్మి...

Friday, November 28, 2008

ఎందరో ఇంకెందరో ఈ ఊచకోథకింకెందరో

"ఎందరో ఇంకెందరో ఈ ఊచకోథకింకెందరో
పాపమొ విపరీతమో మన భారతావనికిది శాపమో

అన్యం పుణ్యం ఎరుగని జనాల ప్రణం తీసిన మత ఉన్మాదులు
అన్నీ వదలి దేశం కోసం ప్రానం ఇచ్చిన వీర జవానులు

ఆవేశంతో ఆక్రోశంతో ఉడికి పోతోంది మన రక్ఠం
ఆలోచనలో ఆచరణతో చేయమంది మది ఒక యుద్ధం

సామాన్య పౌరులం మనం ఈ నేల కుంది మన రుణం
ఆ నీచ కింకరుల ధనం మనలొన పెరుగు ఈ భయం
ధిర్యాన్ని నమ్ము ఈ క్షణం చైతన్య మవ్వు నీ బలం "


లీడర్స్ కీ తెలుసు పొలీసులకి తెలుసు హైదరాబాదు లొ ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతున్నాయో. కాని వాల్లకు వోట్లు కావాలి, పోలీసులకి leaders సపోర్ట్ కావాలి. ఒక పార్టి ఫొటో చెట్టం అని తెస్తే ఇంకొ పార్టి వోట్ల కోసం అది తీసేస్తుంది.

ఫోలీసులు కస్టపడి ఒక ఉగ్రవాదిని పట్టుకుంటె ఒక మంత్రి వాడిని విడిపించుకొని వెలతాడు.

ఎక్స్-సి యం హయాం లొ ఒక ఉగ్రవాదిని కాల్చి చంపుతే హైదరాబాద్ లొ కొన్ని చోట్ల బ్లాక్ day అని షాప్స్ క్లొస్ చేసారు.

ఈప్పటికి ఇండియా లొ చాలా చోట్ల జాతీయ జండాను కాల్చడాలు india ఓడితే సంబరాలు జరుగుతూనె వున్నయి. ఐన వారిని ఏ పార్టి కాని పోలిసులు కాని ఏమి చెయ్యలెరు. అంతెందుకు మనలొ ఎవరికీ తెలిసిన మనము ఏమి చెయ్యలెము. దీనికి కారనం ఆ వుగ్రవాదులలొ వున్న ఐకమత్యం వాల్లలో వున్న తెగింపు మనలో లేకపోవడం.

అందుకె నాకు నా మీద నా సమాజం మిద జాలి కలుగుతోంది.

నెను ఆ దేవున్ని ప్రర్దిస్తున్న, ఆ పేలుల్లలో చనిపోయిన వాల్లకి సాంతిని, మా రాజకీయ నాయకులకు కొంత నిస్వార్ధతను, మాకు కొంత దైర్యాన్ని ప్రసాదించమని.

I selute to all the police who are fighting for saving our lifes without caring their lifes.

Thursday, November 27, 2008

సర్వం నీవె అయ్యప్ప

శివుడివి నీవె విష్నువు నీవె కొలవగ వచ్చే దైవం నీవె
లొపల నీవె వెలుపల నీవె దివిలొ భువిలొ సర్వం నీవె
సత్యం నీవె దర్మం నీవె వాటిని కాచే ధైవం నీవె
మాటవు నీవె పాటవు నీవె వాటికి మూలము భాశవు నీవె
సహనము తోటి పూజలు చెయ్యగ తప్పక పలికే దైవం నీవె

నీవె నీవె అయ్యప్ప సర్వం నీవె అయ్యప్ప
యదలొ నీవె అయ్యప్ప మదిలో నీవె అయ్యప్ప

శరన ఘోష తో కీర్థించదము శరను శరననీ ప్రార్థించెదము
ధయతో మమ్మల కరునించు పాప కార్యమల హరించు
మార్గం నీవె గమ్యం నీవె చివరకు తాకె పాదం నీదె
శక్థి భక్థి ముక్థి నీవె మూక్షం ఇఛ్చే దైవం నీవె

నీవె నీవె అయ్యప్ప సర్వం నీవె అయ్యప్ప
యదలో నీవె అయ్యప్ప మదిలో నీవె అయ్యప్ప

ఆపద్భాందవుడైన నీవె అనాధరక్షకుడినా నీవె
భక్థ సులభుడవైన నీవె మూక్ష ప్రదాథవైన నీవె

తల్లివి నీవె తండ్రివి నీవె గురువు దైవం నువైనావె
ప్రణం నీవె ప్రార్ధన నీవె పంచభూథముల నిండా నీవె

నిన్ను కీర్థింప నిన్ను స్మరింప నిత్య సుఖములనె పొందెదురయ్యా

నీవె నీవె అయ్యప్ప సర్వం నీవె అయ్యప్ప
యదలో నీవె అయ్యప్ప మదిలో నీవె అయ్యప్ప

Tuesday, November 25, 2008

ఆ వానలో...

కలల మేఘం కదలి రాగ, వలపు వర్షం కురిసి పోగ
కడలి హడలి పరుగు తీయగ,

ఆ వానలో నెరజానలా ఓ నెమలిలా నువు ఆడు వేల

నీ వంటిపై జారేటి నీటిని ఈర్షగా నే చూడువేల

ఆగతరమా ఆపతరమా నా హ్రుదయ సంద్రపు అలల గోల

Wednesday, December 19, 2007

In Function

Monday, June 11, 2007

చూడరా ఓ నేస్థమా

చూడరా ఓ నేస్థమా మన భారతావని కడుపుకోత
తెలుపనా ఆ కడుపు నిండని పేదవాడి దీనగోష
ప్రజల కన్న పదవి మిన్నని తలిచెడి ఈ రాజకీయం
ఖంటమున్న పలుకలెక మూగబొయను ప్రజాస్వామ్యం
వెఱ్రిప్రజల వొట్లతోటి పదవి పొందిన నెతలార
పదవి పొందిన మూడునాల్లకె ప్రజలనే మరిచేరులేర
ఏదిరా ఆ ప్రజాస్వామ్యం ఏదిరా ఆ రామరాజ్యం
ఏదిరా మన జాతిపిత ఆ గాంధి కోరిన సమసమాజం
ఊన్న వారికి పూలబాట లెనివాల్లకు ఊచకోత

లేవరా నువు లేవరా మత్తు ఊబిలొ మునగక
అల్లూరి అల్లిన దారి అగు ఆ తిరుగుబాటె బాటగా
భగత్సింఘ్ నోటెంట పలికిన ఇంక్విలాబ్ మదిమాటగా
వీర సిమ్హం శివాజీలా అందరిలొ నువు ముందుగ
దైర్యమే నీ ఆస్థిగా సాహసం నీ స్వసగా
దీక్షయె నీ ద్యాసగా తిరుగుబాటె చేయగా
తేవ్రవాదుల తలలు తెంచి ఉగ్రవాదపు నడుము విరచి
భరథ భూమిని ప్రపంచానికి భవ్య భూమిగ చుపరా

వింటివా ఇది వింటివా నీతి మరచిన నేటి నెత
రాజకీయపు నీచ తంత్రం కంటి పుసులుగ తీసివేసి
నిన్ను నమ్మి పదవి ఇచ్చిన ప్రజలలో దేవున్ని చూచి
ఖన్న బిడ్డల ఆకలె తీర్చేతి తల్లిగ మనసు మలచి
ప్రజలు మెచ్చిన నేతగా భేషు భేష్ అనిపించుకొనరా............

శిక్ష్య కాని శిక్ష్య:

నా బీ-టెక్ రెండవ సంవత్సరం లో సి++ కి నరసిమ్హ్ అనే ఒక పంతులు వచ్చేవారు. చాలా కోపిస్టి. మాకు ప్రతి అర్ధ సంవస్త్సరానికి
రెండు ఇంటర్నల్ పరీక్ష్యలు వుండేవి
. వాటిలో ఏదేని ఒకటి రాస్థే చాలు. నాకు ఎప్పుడు మార్చి కన్న సెప్టెంబర్ కి ప్రాముఖ్యత ఇవ్వడం అలవాటు. అలాగె అప్పుడు కూడ మొదటి ఇంటర్నల్ రాయలెదు.మా క్లాసులో మొత్తం 70 మంది. వారిలో నాలా రాయని వారు 40 మంది. మా అందరిని ప్రతి జవాబు 3 సార్లు వ్రాయమన్నారు పంతులు గారు. తరవాత రోజు వ్రాయని వారిని లేవమన్నారు. ఒక 10 మంది లేచి నిలబడ్డారు(వారిలో నేను వున్నాను). ఆందరిని ఒక్కొక్కటి 5 సార్లు వ్రాయమన్నారు ఈసారి. రెండు రోజుల తరువాత మల్లీ వ్రాయని వారిని లేవమన్నారు. మల్లీ ఈసారి ముగ్గురు లేచి నిలబడ్డారు. వారిలో ఒకరు నవ్వుతూ ఎటువంటి బాధ భయము లేకుండ నిలబడ్డాడు(అది నేనె). మిగిలిన ఇద్దరు భయంతో తలవంచుకు నిలబడ్డారు. అది గమనించిన మాస్టారు నన్ను కూర్చొమ్మని మిగలిన ఇద్దరిని క్లసు నుండి బయటకి వెల్లి అవి వ్రాసాకె తన క్లాసుకి రమ్మన్నారు. నాకు ఏమి అర్ధం కాక అలాగె నిలబడ్డాను. మాస్టారు నన్ను ఇక నేనేమి వ్రాయనవసరం లెదు అన్నారు. దానికి ప్రతిగా నెను ఎందుకు అని అదిగాను. దానికి ఆయన మిగితావాల్లలొ నామీద భయం తప్పుచెసామన్న బాద కనిపిస్థున్నాయి. వాల్లు ఎప్పటికయిన వ్రాస్తారన్న నమ్మకం నాకుంది. నిలో అవేవి నాకు కనిపించ లేదు అందుకె కుర్చోమన్నాను అన్నడు. అప్పుడు తెలిసింది నాకు, నేను శిక్షించడానికి కూదా పనికిరానని. నేను మారు మాట్లాడ కుండా బయటకు వెల్లిపోయాను. తరువాత రోజు క్లసుకి అన్ని వ్రాసి చూపించాను.

దీనినిబట్టి నేను తెలుసుకున్నది "తప్పుచేయడం సహజం, కాని దానిని గుర్తించి సరిచెయకపోవడమే అసలైన తప్పు" అని.

Saturday, January 08, 2005

"నామది"

నామది నా ఉన్నది చదివి చూడు
హృదయముంటే పలికిచూడు
చేయి చేయి కలిపిచూడు
చైతన్యమును కవ్విచ్చి చూడు
నేను నాధనుతొదలి చూడు
మనము ఒకటని తలచి చూడు

మన భావమే ఒక గాగమై
ఆ గానమే ఒక బాణమై
ఆ బాణమే చైతన్యమై
చైతన్యమే కర్తవ్యమై

మానవత్వపు ముకుటమే మన అంతిమ సంకల్పమై
స్వార్దమెరుగని జగతికి సాంతిగా ప్రార్దిద్దాం
అనంతకోటి అస్రువు తుడిచే ఆయుధామే మనమవుదాం
-for peaceful world

Sunday, January 02, 2005

"Leevaraa nuvu leevaraa mathu uubilo munugaka"

Chudaraa oo nesthama mana bharathavani kadupukotha
Telupanaa aa kadupu nindani pedavaadi deenaghosha
Prajala kanna padavi minnani thalichedi ee rajakeeyam
Kantamunna palukaleka mugaboyanu prajaaswamyam
Verriprajala votlathoti padavi pondina nethalaara
Padavi pondina mudunaallake prajalane maricherulera
Aediraa aa prajaaswamyam eediraa aa raamaraajyam
Aediraa mana jaathipita agu ghandhi koorina samasamaajam
Unna vaariki puulabaata lenivaallaku uuchakotha

Levaraa nuvu levaraa mathu uubilo munugaka
Alluri allina daariagu aa tirugubaate baatagaa
Bhagathsingh nootenta palikina inkvilaab madimaatagaa
Veera simham sivaajeelaa andarilo nuvu munduga
Dhiryame nee aasthigaa saahasam nee swasagaa
Deekshayee nee dyaasagaa thirugubaate cheyagaa
Teevravaadula thalalu thenchi ugravaadapu nadumu virachi
Bharatha bhumini prapanchaaniki bhavya bhuumiga chuparaa

Vintivaa idi vintivaa neethi marachina neeti netha
Raajakiyapu neecha thantram kanti pusuluga thisiveesi
Ninuu nammi padavi ichina prajalalo deevunni chuchi
Kanna biddala aakale thircheti manishiga manasu malachi
Prajalu mechina neethagaa bhesh bhesh anipinchukonaraa............

"NAAmadi"

Naamadi na unnadi chadivi chuudu
hrudayamunte palikichuudu
cheeyi cheeyi kalipichuudu
chaithanyamunu kavvinchi chuudu
nenu naadhanutodali chuudu
manamu okatani thalachi chuudu

mana bhaavame oka gaanamy
aa gaaname oka bhaanamy
aa bhaaname chithanyamy
chithanyame karthavyamy

maanavatvapu makutame mana anthima sankalpamy

swaarthamerugani jegathiki shaanthigaa pooraadudhaam

ananthakooti asruvu thudichea aayudhamee manamavudhaam

aathmastyryam veedanaadaka kadadhaakaa pooraadadhaam...........

-----for peaceful world