Monday, June 11, 2007

చూడరా ఓ నేస్థమా

చూడరా ఓ నేస్థమా మన భారతావని కడుపుకోత
తెలుపనా ఆ కడుపు నిండని పేదవాడి దీనగోష
ప్రజల కన్న పదవి మిన్నని తలిచెడి ఈ రాజకీయం
ఖంటమున్న పలుకలెక మూగబొయను ప్రజాస్వామ్యం
వెఱ్రిప్రజల వొట్లతోటి పదవి పొందిన నెతలార
పదవి పొందిన మూడునాల్లకె ప్రజలనే మరిచేరులేర
ఏదిరా ఆ ప్రజాస్వామ్యం ఏదిరా ఆ రామరాజ్యం
ఏదిరా మన జాతిపిత ఆ గాంధి కోరిన సమసమాజం
ఊన్న వారికి పూలబాట లెనివాల్లకు ఊచకోత

లేవరా నువు లేవరా మత్తు ఊబిలొ మునగక
అల్లూరి అల్లిన దారి అగు ఆ తిరుగుబాటె బాటగా
భగత్సింఘ్ నోటెంట పలికిన ఇంక్విలాబ్ మదిమాటగా
వీర సిమ్హం శివాజీలా అందరిలొ నువు ముందుగ
దైర్యమే నీ ఆస్థిగా సాహసం నీ స్వసగా
దీక్షయె నీ ద్యాసగా తిరుగుబాటె చేయగా
తేవ్రవాదుల తలలు తెంచి ఉగ్రవాదపు నడుము విరచి
భరథ భూమిని ప్రపంచానికి భవ్య భూమిగ చుపరా

వింటివా ఇది వింటివా నీతి మరచిన నేటి నెత
రాజకీయపు నీచ తంత్రం కంటి పుసులుగ తీసివేసి
నిన్ను నమ్మి పదవి ఇచ్చిన ప్రజలలో దేవున్ని చూచి
ఖన్న బిడ్డల ఆకలె తీర్చేతి తల్లిగ మనసు మలచి
ప్రజలు మెచ్చిన నేతగా భేషు భేష్ అనిపించుకొనరా............

2 comments: