Sunday, December 13, 2009

రాజకీయ నిరుద్యోగి రాత మారె ఒక రాత్రి,

సర్కారులొ పదవిలేదు, బ్యాంకు లోన డబ్బు లెదు
తాగ నీకి మందులేదు, పంటికింద ముక్కలేదు
ఎటు వెల్లిన దిక్కులేదు, ఏంచెయ్యను తోస్థలెదు

రాజకీయ నిరుద్యోగి రాత మారె ఒక రాత్రి,
తలకెక్కిన తిక్కలోన పాడినాను తెలంగాన,
నా తిక్కకు తోక లాగ వెంటొచ్చెను పెద్ద సేన,

ఊరూర తిరిగాను, వెర్రి తోటి వాగినాను,
ప్రత్యెక తెలంగాన, ఇంటింట కురువు వాన,
గోదారికి ఆనకట్ట, అడ్డొస్థే విరుగు కట్ట,
బుద్దిలేని మొద్దులంత, కలిసారు ఒక్క చోట
కండలేని గండడంట, తెలంగాన తెస్థడంట
మీకండగ తానంట, నీరుండదు ఏ కంట

చేతినిండ డబ్బులొచ్చె, సర్కారున పదవొచ్చె,
సీటు కింత పైక మొచ్చె, సెటిలయ్యే దారి తోచె,
ఏడేల్లు గడిచిపోయె తెలంగాన నిదరపోయె
తోడొచ్చిన వెర్రి మూక తిక్క కాస్థ ముదిరి పోయె
పదవి పోయె, పరువు పోయె, పెంచు కున్న ఆస్థి పోయె

మత్తెక్కిన మాయ లొన, నను తోసిరి దీక్ష్య పూన,
సర్లే ఒకదినమనుకొని మొదలెడిటిని NIM's లోన
నిజమనుకొని ఇంతలోన రగిలిపోయె తెలంగాన
నే పన్నిన వుచ్చులోన, పిచ్చెక్కిన కుర్ర సేన

కండలేని బండ నేను, తిండి లేక వుండలేను,
బిస్కట్టు తొ బతకలెను, సెలైనె తాగి సావ లేను,
దీక్ష్య నేను చెయ్యలేను, బయటి కసలు రాలేను,

తాగ నీకి మందు లేదు, పంటి కింద ముక్కలెదు
కాపాడె దిక్కులేదు, ఏంచెయ్యను తోస్థలేదు
ఇంత లోన వింత లాన, వెలిగొచ్చెను తెలంగాన

హీరొ నను చేసారు, మహాత్ముడితొ పోల్చారు
రాజకీయ సన్యాసిని రాజులాగ మార్చారు
పదవిలేని బికారికి, బతుకు దారి నేర్పారు
మీ ఋణము తీర్చలేను నా గుణము మార్చుకోను

జై జై జై తెలంగాన నా చేతికి దొరికె వీన
జై జై జై తెలంగాన డాన్సెస్థిని వీన తొన

17 comments:

  1. సూపర్ ....... కుమ్మేసావ్ అంతే

    ReplyDelete
  2. correct ga raasavu.good

    ReplyDelete
  3. super boss, chaala baaga raasaru

    ReplyDelete
  4. వెల్ డన్. ఆంధ్ర జిన్నా, తెలబాన్లను ఉరితీయాలి

    ReplyDelete
  5. అతను Deputy స్పీకర్ అని తెలుసా అన్న ....

    ReplyDelete
  6. You rock.

    Good to see you in form after long time.

    continue writing more poems. These are needed at the moment to save Telugu

    ReplyDelete
  7. WOW....
    AT LAST.....SOMEBODY SPEAKING.....
    PLEASE ......COME FORWARD.....

    FANTASTIC........THE TRUTH SAID!

    ReplyDelete
  8. Hi,

    Thanks for asking.... Did you tried here http://translate.google.com/translate_tools?hl=en&layout=1&eotf=1

    Check this link you will get a few lines of code which you can insert in your blog/webpage & done... :-)

    All the Best!!!

    Regards
    Navrang
    http://navrangblog.blogspot.com

    ReplyDelete
  9. Very nice purush....keep it up....

    Regards
    Chandu
    http://revurifun.blogspot.com

    ReplyDelete
  10. దొరగారి ఏడేండ్ల పాలనను సూటిగా అద్బుతంగా వివరించారు అన్నయ్య... 👏🙏

    ReplyDelete