Saturday, July 17, 2010

ఎగిరేయ్ మనసా ఎగిరేయ్

ఎగిరేయ్ మనసా ఎగిరేయ్,   గమ్యం చేరగ ఎగిరేయ్
తీరం వైపుగ ఎగిరేయ్

మనసుకు గొల్లెం వెయ్యకు నేడుఎగిరే పక్షిని తనివిగ చూడు,   
ఆశను ఒంటరి చెయ్యకు నేడు, జంటగ వెల్లర ముందుకు తోడు,  

శూన్యం శాంతిని తలపించొచ్చుప్రళయం ప్రణం తీసెయ్యొచ్చు,
కష్టం నష్టం యెదురవ్వొచ్చు,
మహ ఇష్టంగా నువ్వెదురై, అద్రుష్టం తోడుగ ఎగిరేయ్
ఎగిరేయ్ పైపై కెగిరేయ్,
ఎగిసే అల పైకెగిరేయ్, కల నిజమే చెయ్యగ ఎగిరేయ్ 

ఎగిరేయ్ మనసా ఎగిరేయ్, గమ్యం చేరగ ఎగిరేయ్
తీరం వైపుగ ఎగిరేయ్

Monday, March 08, 2010

నేడు వున్నది ఎంజొయ్ చేస్తే చాలు

నిన్న అన్నది తిరిగే రాదు, రేపు అన్నది తెలిసేం రాదు
నేడు వున్నది ఎంజొయ్ చేస్తే చాలు

లేని దానికై చింతేం వద్దు, రాని దానికై పరిగెత్తొద్దు
వున్న దానిని ప్రేమించడమే ముద్దు

కడలికందము ఎగిసే అలలు, నిదురకందము కమ్మని కలలు
మనిషికందము మొమున ఓ చిరునవ్వు

చీకటి లోనె చండ్రుడి అందం, నల్లని కాటుక కంటికి అందం
కష్టం, ఇష్టం కలిసుంటేనె అందం