Monday, June 11, 2007

చూడరా ఓ నేస్థమా

చూడరా ఓ నేస్థమా మన భారతావని కడుపుకోత
తెలుపనా ఆ కడుపు నిండని పేదవాడి దీనగోష
ప్రజల కన్న పదవి మిన్నని తలిచెడి ఈ రాజకీయం
ఖంటమున్న పలుకలెక మూగబొయను ప్రజాస్వామ్యం
వెఱ్రిప్రజల వొట్లతోటి పదవి పొందిన నెతలార
పదవి పొందిన మూడునాల్లకె ప్రజలనే మరిచేరులేర
ఏదిరా ఆ ప్రజాస్వామ్యం ఏదిరా ఆ రామరాజ్యం
ఏదిరా మన జాతిపిత ఆ గాంధి కోరిన సమసమాజం
ఊన్న వారికి పూలబాట లెనివాల్లకు ఊచకోత

లేవరా నువు లేవరా మత్తు ఊబిలొ మునగక
అల్లూరి అల్లిన దారి అగు ఆ తిరుగుబాటె బాటగా
భగత్సింఘ్ నోటెంట పలికిన ఇంక్విలాబ్ మదిమాటగా
వీర సిమ్హం శివాజీలా అందరిలొ నువు ముందుగ
దైర్యమే నీ ఆస్థిగా సాహసం నీ స్వసగా
దీక్షయె నీ ద్యాసగా తిరుగుబాటె చేయగా
తేవ్రవాదుల తలలు తెంచి ఉగ్రవాదపు నడుము విరచి
భరథ భూమిని ప్రపంచానికి భవ్య భూమిగ చుపరా

వింటివా ఇది వింటివా నీతి మరచిన నేటి నెత
రాజకీయపు నీచ తంత్రం కంటి పుసులుగ తీసివేసి
నిన్ను నమ్మి పదవి ఇచ్చిన ప్రజలలో దేవున్ని చూచి
ఖన్న బిడ్డల ఆకలె తీర్చేతి తల్లిగ మనసు మలచి
ప్రజలు మెచ్చిన నేతగా భేషు భేష్ అనిపించుకొనరా............

శిక్ష్య కాని శిక్ష్య:

నా బీ-టెక్ రెండవ సంవత్సరం లో సి++ కి నరసిమ్హ్ అనే ఒక పంతులు వచ్చేవారు. చాలా కోపిస్టి. మాకు ప్రతి అర్ధ సంవస్త్సరానికి
రెండు ఇంటర్నల్ పరీక్ష్యలు వుండేవి
. వాటిలో ఏదేని ఒకటి రాస్థే చాలు. నాకు ఎప్పుడు మార్చి కన్న సెప్టెంబర్ కి ప్రాముఖ్యత ఇవ్వడం అలవాటు. అలాగె అప్పుడు కూడ మొదటి ఇంటర్నల్ రాయలెదు.మా క్లాసులో మొత్తం 70 మంది. వారిలో నాలా రాయని వారు 40 మంది. మా అందరిని ప్రతి జవాబు 3 సార్లు వ్రాయమన్నారు పంతులు గారు. తరవాత రోజు వ్రాయని వారిని లేవమన్నారు. ఒక 10 మంది లేచి నిలబడ్డారు(వారిలో నేను వున్నాను). ఆందరిని ఒక్కొక్కటి 5 సార్లు వ్రాయమన్నారు ఈసారి. రెండు రోజుల తరువాత మల్లీ వ్రాయని వారిని లేవమన్నారు. మల్లీ ఈసారి ముగ్గురు లేచి నిలబడ్డారు. వారిలో ఒకరు నవ్వుతూ ఎటువంటి బాధ భయము లేకుండ నిలబడ్డాడు(అది నేనె). మిగిలిన ఇద్దరు భయంతో తలవంచుకు నిలబడ్డారు. అది గమనించిన మాస్టారు నన్ను కూర్చొమ్మని మిగలిన ఇద్దరిని క్లసు నుండి బయటకి వెల్లి అవి వ్రాసాకె తన క్లాసుకి రమ్మన్నారు. నాకు ఏమి అర్ధం కాక అలాగె నిలబడ్డాను. మాస్టారు నన్ను ఇక నేనేమి వ్రాయనవసరం లెదు అన్నారు. దానికి ప్రతిగా నెను ఎందుకు అని అదిగాను. దానికి ఆయన మిగితావాల్లలొ నామీద భయం తప్పుచెసామన్న బాద కనిపిస్థున్నాయి. వాల్లు ఎప్పటికయిన వ్రాస్తారన్న నమ్మకం నాకుంది. నిలో అవేవి నాకు కనిపించ లేదు అందుకె కుర్చోమన్నాను అన్నడు. అప్పుడు తెలిసింది నాకు, నేను శిక్షించడానికి కూదా పనికిరానని. నేను మారు మాట్లాడ కుండా బయటకు వెల్లిపోయాను. తరువాత రోజు క్లసుకి అన్ని వ్రాసి చూపించాను.

దీనినిబట్టి నేను తెలుసుకున్నది "తప్పుచేయడం సహజం, కాని దానిని గుర్తించి సరిచెయకపోవడమే అసలైన తప్పు" అని.