Sunday, December 13, 2009

రాజకీయ నిరుద్యోగి రాత మారె ఒక రాత్రి,

సర్కారులొ పదవిలేదు, బ్యాంకు లోన డబ్బు లెదు
తాగ నీకి మందులేదు, పంటికింద ముక్కలేదు
ఎటు వెల్లిన దిక్కులేదు, ఏంచెయ్యను తోస్థలెదు

రాజకీయ నిరుద్యోగి రాత మారె ఒక రాత్రి,
తలకెక్కిన తిక్కలోన పాడినాను తెలంగాన,
నా తిక్కకు తోక లాగ వెంటొచ్చెను పెద్ద సేన,

ఊరూర తిరిగాను, వెర్రి తోటి వాగినాను,
ప్రత్యెక తెలంగాన, ఇంటింట కురువు వాన,
గోదారికి ఆనకట్ట, అడ్డొస్థే విరుగు కట్ట,
బుద్దిలేని మొద్దులంత, కలిసారు ఒక్క చోట
కండలేని గండడంట, తెలంగాన తెస్థడంట
మీకండగ తానంట, నీరుండదు ఏ కంట

చేతినిండ డబ్బులొచ్చె, సర్కారున పదవొచ్చె,
సీటు కింత పైక మొచ్చె, సెటిలయ్యే దారి తోచె,
ఏడేల్లు గడిచిపోయె తెలంగాన నిదరపోయె
తోడొచ్చిన వెర్రి మూక తిక్క కాస్థ ముదిరి పోయె
పదవి పోయె, పరువు పోయె, పెంచు కున్న ఆస్థి పోయె

మత్తెక్కిన మాయ లొన, నను తోసిరి దీక్ష్య పూన,
సర్లే ఒకదినమనుకొని మొదలెడిటిని NIM's లోన
నిజమనుకొని ఇంతలోన రగిలిపోయె తెలంగాన
నే పన్నిన వుచ్చులోన, పిచ్చెక్కిన కుర్ర సేన

కండలేని బండ నేను, తిండి లేక వుండలేను,
బిస్కట్టు తొ బతకలెను, సెలైనె తాగి సావ లేను,
దీక్ష్య నేను చెయ్యలేను, బయటి కసలు రాలేను,

తాగ నీకి మందు లేదు, పంటి కింద ముక్కలెదు
కాపాడె దిక్కులేదు, ఏంచెయ్యను తోస్థలేదు
ఇంత లోన వింత లాన, వెలిగొచ్చెను తెలంగాన

హీరొ నను చేసారు, మహాత్ముడితొ పోల్చారు
రాజకీయ సన్యాసిని రాజులాగ మార్చారు
పదవిలేని బికారికి, బతుకు దారి నేర్పారు
మీ ఋణము తీర్చలేను నా గుణము మార్చుకోను

జై జై జై తెలంగాన నా చేతికి దొరికె వీన
జై జై జై తెలంగాన డాన్సెస్థిని వీన తొన

Tuesday, June 16, 2009

చెలియా... నీ జాడేది

చెలియా.. చెలియా.. ఏ వైపు నిన్ను నే వెతికేది
కలయా.. అలయా.. తీరాన్ని దాటి నిను చేరేది
నిన్నటి ఙ్నప్థిని అడిగా నీ జాడేదో తెలుపమని
రేపటి భ్రాంతిని కోరా నిను చేరే దారిన వెల్లమని
ఇప్పటి తలపుకు తెలిపా నా నిండా నువ్వే చూడమని

చెలియా.. చెలియా.. ఏ వైపు నిన్ను నే వెతికేది
కలయా.. అలయా.. తీరాన్ని దాటి నిను చేరేది
అలసిన హౄదయం అడిగెనే, ఈ.. పయణం చాలిక ఆగని
బదులుగ మనసే కోరెనె, నిను చేరు వరకు ఆగొద్దని
విసిగిన విరహం అడిగెలే, ఈ.. జ్వాలలు ఆరేదెపుడని
వెచ్చని ఊపిరి బదులిడె, చెలి చిరునవ్వుల జల్లులు కురవనీ
చెలియా.. చెలియా.. ఏ వైపు నిన్ను నే వెతికేది
కలయా.. అలయా.. తీరాన్ని దాటి నిను చేరేది


Wednesday, March 04, 2009

నీ పేరు వెంకట సామి

నా పేరు వెంకట సామి, మీ సేవ కేసి నెనొచ్చా అన్నీ మాని,
మీ కష్టం తీరును హామి, నా మాట వింటె ఈ వూరె బంగరు భూమి,

ఉచితంగ చదివిస్త, ఆసుపత్రి కట్టిస్త,
అప్పుల్ని కట్టేస్థ, కరెంటు ప్రీగిస్థ,
మి పంట పండించ గోదారిని రప్పిస్థ,
ఏ కష్టం మీకున్న కన్నీరె నా కంట,

నా పేరు వెంకట సామి, మీ సేవ కేసి నేనొచ్చా అన్నీ మాని,
మీ కష్టం తీరును హామి, నా మాట వింటె ఈ వూరె బంగరు భూమి,

నీ పేరు వెంకట సామి, నీ తిన్నదరగ మమ్మిట్ల సంపకు సామి,
నీ నోరు మూయర సామి, నీ మాట వింటె బతుకంత బండర సామి,

మంచి నీళ్ళు కరువంటె మంచు కరగ లేదంటవ్,
రోడ్డు లెధు సూడంటె రాళ్ళు దొరక లెదంటవ్,
ఆసుపత్రి ఏదంటె డాట్టరయ్య లెడంటవ్

మీ బంటు నేనంటు ఐదేల్ల కొకసారి, వోటెయ్య మంటావు మమ్మల్ని బ్రతిమాలి
వొటెసి గెలిపిస్థే నినునమ్మి ప్రతిసారి, బస్థీకి పోతావు సల్లంగ నువు జారి

మే మారి పోతిమి సామి, వోటెయ్య మంటు మా వెంట తిరగకు సామి
మా కష్టం తెలిసిన వాన్ని, మా వోటు తోటి గెలిపించు కుటాం నమ్మి...